Anchor Rashmi Gautam Birthday Celebrations Post Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmi Gautam: నా లైఫ్‌లో ఇంపార్టెంట్ ఆ ముగ్గురే: రష్మీ

Published Tue, May 2 2023 2:27 PM | Last Updated on Tue, May 2 2023 3:06 PM

Rashmi Gautam Instagram Post Viral On Her Birthday celebrations - Sakshi

బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్‌ యాంకర్‌ రాణిస్తున్న రష్మీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటోంది. కామెడీ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవలే తన ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డే వేడుకలు చేసుకున్న రష్మీ తాజాగా తన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. అవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

( ఇది చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

రష్మీ ఇన్‌స్టాలో రాస్తూ..'మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో వాటికే కట్టుబడి ఉండండి. మిమ్మల్ని విడిచి వెళ్లాలనుకునే వారిని వదిలేయండి. నా లైఫ్‌లో మరో ఏడాది గడిచిపోయింది. దానికి తగిన విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తున్నా. ఈ బర్త్‌డేను నాకు గుర్తుండేలా స్పెషల్‌గా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ‍్యామిలీ నా జీవితంలో మూడు ప్రధాన స్తంభాలు. అందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. స్నేహితుల సమక్షంలో ఏప్రిల్ 27న తన 35వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకుంది బుల్లితెర యాంకరమ్మ. 

(ఇది చదవండి: నాగచైతన్య 'కస్టడీ' ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌,ఎప్పుడంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement