పెద్దపంజాని(చిత్తూరు): ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం పెద్దారికుంట గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వెంకట రమణ(55)ను గుర్తుతెలియని దుండగులు కర్రలతో కొట్టి చంపారు.
గ్రామ శివారులో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.