రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య | man suicide at railway track in parvathipuram | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

Published Tue, Aug 4 2015 1:55 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

man suicide at railway track in parvathipuram

పార్వతీపురం : అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కొమరాడ మండలం వన్నం గ్రామానికి చెందిన పల్ల రవి (24) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో అతనికి నోటి క్యాన్సర్ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. దాంతో ఈ రోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్పై మృతదేహన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement