నిర్వాహకులు గమనించి వెంటనే ఫైరింజి¯ŒSకు సమాచారమందించారు. ప్లాస్టిక్ బాటిల్స్ కావడం, ఆరుబయట గుజిరీ ఉండడంతో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేలోపు గాలి వ్యాపించి నిమిషాల్లో మంటలు గుజిరీ అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అగ్రిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడానికి వీలులేకుండా పోయింది. మంటల్లో దాదాపు 80 శాతం గుజిరీ కాలిపోయింది. రెండు ఫైరింజిన్లు వచ్చి మంటలు అదుపు చేసినా ఫలితం లేకపోయింది. గుజిరీ మొత్తం కాలిబూడిద కావడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బాధితుడు నూర్‌బాబా మాట్లాడుతూ దాదాపు రూ.20 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. షార్టుసర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్నది తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరాడు. స్టేష¯ŒS ఫైర్ ఆఫీసర్ కేపీ లింగమయ్య నష్టం అంచనా వేశారు. దాదాపు రూ.10 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని భావించారు.