ఉపాధ్యాయులు లేని చదువులా?: రాజేశ్వరి
ఉపాధ్యాయులు లేని చదువులా?: రాజేశ్వరి
Published Mon, Aug 8 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
రంపచోడవరం: పెదగెద్దాడ వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మార్చి రెండునెలలైనప్పటికీ అక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంపై ఎమ్మెల్యే రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం ఆ పాఠశాలను సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలోని 14 ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ అమలులో కక్కుర్తి పడితే సహించేది లేదన్నారు.
ప్రజాదర్బారుతో ప్ర యోజనమేంటి?
గిరిజనుల సమస్యలను పరిష్కరిం చలేని ప్రజాదర్బారును నిర్వహించడంతో ఎవరికీ ఉపయోగం లేదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకంలో వాచ్ అండ్ వార్డులో జీడిమామిడి మొక్కలను సంరక్షించుకున్న గిరిజన రైతులకు మూడేళ్లుగా వేతనాలు చెల్లించడం లేదని ఎమ్మె ల్యే ఆరోపించారు. వారు వేతనాలు ఇ ప్పించాలంటూ పదేపదే ప్రజాదర్బారులో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బారులో గిరిజన రైతులతో కలిసి ఆమె ఆ విషయంలో అధికారులను నిల దీశారు. ఇప్పటికైనా అధికారులు వారి వే తనాల చెల్లింపునకు చర్యలు తీసుకోకుంటే ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తామన్నారు.
ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
స్దానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లను పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజేశ్వరి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాజంనేయులు, సర్పంచ్ పండా రామకృష్ణదొర, ఎంపీటీసీ సభ్యులు కారుకోడి పూజా తదితరులు ఉన్నారు.
Advertisement