There
-
అభివృద్ధి ప్రసంగాల్లేవు..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఎన్నికల కోడ్ ప్రభావం కాకినాడ సిటీ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ ప్రభావం జిల్లా కేంద్రంలో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై పడింది. ఏటా కాకినాడ పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పతాకావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరై పతాకావిష్కరణ చేసేవారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనవచ్చని, వేడుకల్లో పాల్గొన్న మంత్రులు కేవలం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశంపైనే ప్రసంగం ఉండాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ పరంగా సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫొటోల ప్రదర్శన లేకుండా చూడాలని సూచించింది. దీంతో జిల్లా ప్రగతికి సంబంధించిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే శకటాల ప్రదర్శనపై సందిగ్ధం ఏర్పడింది. ఏటా జిల్లా పోలీసు పేరెడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అత్యంత అట్టహాసంగా నిర్వహించేవారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో కార్యక్రమాన్ని కాకినాడ పోలీసు పేరెడ్ గ్రౌండ్ నుంచి కాకినాడ రూరల్ ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌కు మార్పు చేస్తే ఎలా ఉంటుందనే తర్జనభర్జనలో అధికార యంత్రాంగం ఉంది. పతాకావిష్కరణ జిల్లా ఇన్చార్జి మంత్రి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పతావిష్కరణ జిల్లా ఇన్చార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా మంత్రులే పతాకావిష్కరణలు చేశారు. 2014లో ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, 2015లో ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, 2016లో మంత్రి చినరాజప్ప పతాకావిష్కరణ చేశారు. -
పాత 500 తీసుకునేది ఇక్కడ మాత్రమే
-
స్తంభం విరిగినా.. పట్టించుకోరా..!
మర్రిగూడ : మండల కేంద్రంలోని గంథ్రాలయ వద్ద నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో విద్యుత్ స్తంభం మధ్యకు విరిగి ఇనుప చువ్వల ఆధారంగా వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. ఈ స్తంభం నుంచివెళ్లే లైన్‌తోనే గృహాలకు విద్యుత్ సరఫరా అవుతున్నా సంబంధిత అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ స్తంభంతో పెను ముప్పు పొంచి ఉన్నందున వెంటనే దాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉపాధ్యాయులు లేని చదువులా?: రాజేశ్వరి
రంపచోడవరం: పెదగెద్దాడ వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మార్చి రెండునెలలైనప్పటికీ అక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంపై ఎమ్మెల్యే రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం ఆ పాఠశాలను సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలోని 14 ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ అమలులో కక్కుర్తి పడితే సహించేది లేదన్నారు. ప్రజాదర్బారుతో ప్ర యోజనమేంటి? గిరిజనుల సమస్యలను పరిష్కరిం చలేని ప్రజాదర్బారును నిర్వహించడంతో ఎవరికీ ఉపయోగం లేదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకంలో వాచ్ అండ్ వార్డులో జీడిమామిడి మొక్కలను సంరక్షించుకున్న గిరిజన రైతులకు మూడేళ్లుగా వేతనాలు చెల్లించడం లేదని ఎమ్మె ల్యే ఆరోపించారు. వారు వేతనాలు ఇ ప్పించాలంటూ పదేపదే ప్రజాదర్బారులో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బారులో గిరిజన రైతులతో కలిసి ఆమె ఆ విషయంలో అధికారులను నిల దీశారు. ఇప్పటికైనా అధికారులు వారి వే తనాల చెల్లింపునకు చర్యలు తీసుకోకుంటే ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తామన్నారు. ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన స్దానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లను పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజేశ్వరి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాజంనేయులు, సర్పంచ్ పండా రామకృష్ణదొర, ఎంపీటీసీ సభ్యులు కారుకోడి పూజా తదితరులు ఉన్నారు. -
జాఫర్‌కు మొండిచేయి
మొయిలీకి చోటు పది మందితో కాంగ్రెస్ రెండో జాబితా మరో నాలుగు పెండింగ్ ‘బెంగళూరు ఉత్తర’ నుంచి నారాయణ స్వామి బరిలోకి? సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు గురువారం రాత్రి కాంగ్రెస్ పది మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. బెంగళూరు సెంట్రల్ స్థానాన్ని ఆశించిన సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్‌కు నిరాశ ఎదురైంది. ఈ స్థానానికి యువజన కాంగ్రెస్ నాయకుడు రిజ్వాన్ అర్షద్‌ను ఎంపిక చేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీకి ఈ జాబితాలో చోటు లభించింది. మంగళూరు స్థానం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు జనార్దన పూజారి పేరు ఖరారైంది. ఈ స్థానం కోసం ఇటీవల నిర్వహించిన ఆంతరంగిక పోలింగ్ (ప్రైమరీస్)లో పూజారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇంకా...రాయచూరు స్థానానికి బీవీ. నాయక్, చిత్రదుర్గకు చంద్రప్ప, బెల్గాంకు లక్ష్మీ హెబ్బాల్కర్, కొప్పళకు బసవరాజ హిట్నాళ్, శివమొగ్గకు మంజునాథ్ భండారీ, బాగలకోటెకు అజయ్ కుమార్ సర్నాయక్, చిక్కోడికి ప్రకాశ్ హుక్కేరిలను ఎంపిక చేసింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వీటిలో బెంగళూరు ఉత్తర నియోజక వర్గం కూడా ఉంది. గురువారం ఇక్కడ ఈ నియోజక వర్గానికి ప్రైమరీస్‌ను నిర్వహించగా మాజీ ఎంపీ సీ. నారాయణ స్వామి ఎన్నికయ్యారు. కనుక ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లే. ఇక హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ నియోజక వర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.