జాఫర్‌కు మొండిచేయి | Ker japharku | Sakshi

జాఫర్‌కు మొండిచేయి

Published Fri, Mar 14 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

లోక్‌సభ ఎన్నికలకు గురువారం రాత్రి కాంగ్రెస్ పది మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. బెంగళూరు సెంట్రల్ స్థానాన్ని ఆశించిన సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్‌కు నిరాశ ఎదురైంది.

  •  మొయిలీకి చోటు
  •  పది మందితో   కాంగ్రెస్ రెండో జాబితా
  •  మరో నాలుగు పెండింగ్
  •  ‘బెంగళూరు ఉత్తర’ నుంచి నారాయణ స్వామి బరిలోకి?
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు గురువారం రాత్రి కాంగ్రెస్ పది మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. బెంగళూరు సెంట్రల్ స్థానాన్ని ఆశించిన  సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్‌కు నిరాశ ఎదురైంది. ఈ స్థానానికి యువజన కాంగ్రెస్ నాయకుడు రిజ్వాన్ అర్షద్‌ను ఎంపిక చేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీకి ఈ జాబితాలో చోటు లభించింది.

    మంగళూరు స్థానం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు జనార్దన పూజారి పేరు ఖరారైంది. ఈ స్థానం కోసం ఇటీవల నిర్వహించిన ఆంతరంగిక పోలింగ్ (ప్రైమరీస్)లో పూజారి ఎన్నికైన సంగతి తెలిసిందే.  ఇంకా...రాయచూరు స్థానానికి బీవీ. నాయక్, చిత్రదుర్గకు చంద్రప్ప, బెల్గాంకు లక్ష్మీ హెబ్బాల్కర్, కొప్పళకు బసవరాజ హిట్నాళ్, శివమొగ్గకు మంజునాథ్ భండారీ, బాగలకోటెకు అజయ్ కుమార్ సర్నాయక్, చిక్కోడికి ప్రకాశ్ హుక్కేరిలను ఎంపిక చేసింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

    వీటిలో బెంగళూరు ఉత్తర నియోజక వర్గం కూడా ఉంది. గురువారం ఇక్కడ ఈ నియోజక వర్గానికి ప్రైమరీస్‌ను నిర్వహించగా మాజీ ఎంపీ సీ. నారాయణ స్వామి ఎన్నికయ్యారు. కనుక ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లే. ఇక హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ నియోజక వర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement