masters
-
నలభీముల వంట పండింది
కేవలం నాలుగు రోజులు వంట పని. ఉదయం సుమారు 500 మందికి టిఫిన్.. 1,500 నుంచి 2 వేల మందికి నాన్ వెజ్ వంటకాలతో మధ్నాహ్న, రాత్రి భోజనం.. సాయంత్రం స్నాక్స్. ఇవన్నీ చేయడానికి ఆరేడుగురు వంట మేస్త్రీలు, మాస్టర్లు, మహిళలు సహా పదిమందికి పైగా సహాయకులు. రోజుకు కనీసం రూ.50 వేల చొప్పున సంక్రాంతి పండుగ మొత్తం రూ.2 లక్షలకు మించి వెచ్చించే తరుణమిది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి–మాదలవారిగూడెం సమీపంలో కోడి పందేల బరివద్ద ఏర్పాట్ల కోసం ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన వారితో కుదుర్చుకున్న ఒప్పందమిది.సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వంటల్లో చేయితిరిగిన నలభీములకు సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటవుతున్న బరుల వద్ద పైతరహా ఒప్పందాలు జరిగాయి. సంప్రదాయ పిండి వంటలు, తీపి పదార్థాలు చేయడంలోనూ అనుభవజ్ఞుల పంట పండుతోంది. నాన్ వెజ్ వంటకాల్లో ప్రావీణ్యం ఉన్న ఒక్కో వంట మాస్టర్‌కు రోజుకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు సమకూరుతోంది. నగరాలు, పట్టణాల్లోని హోటళ్లలో పనిచేస్తున్న మాస్టర్లు కొందరు స్వస్థలాలకు వెళ్లి వస్తామంటూ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకుని వెళుతున్నారని ఆయా హోటళ్ల నిర్వాహకులు, యజమానులు చెబుతున్నారు. కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కోసంసంక్రాంతికి ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్లు, బంధువులు, స్నేహితులకు వివిధ రకాల విందు భోజనాలు ఏర్పాటు చేయాలని సంపన్న వర్గాల వారు తహతహలాడుతుంటారు. అల్లుళ్లకు మర్యా దలు చేయడంలో గోదారోళ్ల స్టైలే వేరు. కృష్ణా, గుంటూరు వాళ్లదీ అదే తీరు. వందల రకాలు వడ్డించడం వారికొక సరదా. గతేడాది ఏలూరు జిల్లాలో కొత్త అల్లుడికి 379 రకాల పదార్థాలు వడ్డించిన కుటుంబం వార్తల్లో నిలిచింది. వంద రకాలకు పైగా స్వీట్లు, నలభై రకాలకు మించి స్నాక్స్, నలభై రకాల కూరలు, ఇరవై రకాల చట్నీలు.. ఇలా విభిన్న పదార్థాలు విస్తరిలో వడ్డించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.ఇలాంటివి పలుచోట్ల చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, కొరమీను, మెత్తళ్లు, నల్లసందువా తదితర చేపలతో వెరైటీలు చేయగలిగిన వారిని సంపన్న కుటుంబాల వారు రోజుకు లేదా గుంపగుత్తగా రూ.వేలల్లో చెల్లించి నియమించుకుంటున్నారు. వారం నుంచి పక్షం రోజుల వరకు ఇళ్లల్లోనే ఉండి కావాల్సిన వెరైటీ వంటలు చేయాల్సి ఉంటుంది. రోజుకు వేతనం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారని, సహాయకుడికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారని పాలకొల్లుకు చెందిన కేటరింగ్ నిర్వాహకుడు మజ్జి శ్రీనివాస్ వివరించారు. దమ్ చేయడం తెలిస్తే..మటన్, బికెన్ దమ్ బిర్యానీ చేయడంలో ఆరితేరిన వారికి మంచి డిమాండ్ ఉందని విజయవాడలో పలు హోటళ్లు నిర్వహిస్తున్న మనోహర్ ‘సాక్షి’కి చెప్పారు. ఏదైనా ఒక ఈవెంట్ కోసం 2 వేల మందికి స్పెషల్స్ చేయడానికి మాస్టర్ రూ.6 వేల నుంచి రూ.7 వేలు తీసుకుంటారని, సంఖ్య అంతకు మించితే మరో మాస్టర్‌కు అంతే మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మాస్టర్లకు, వారి సహాయకులకు వసతి, భోజనం, రవాణా వసతి అదనం. వివాహాలు, ఈవెంట్ల కోసం రెండు రకాల వెరైటీ స్వీట్స్ చేసే వారికి కూడా మంచి డిమాండ్ ఉందని వివరించారు.ఇతర జిల్లాల వారికీ డిమాండ్⇒ పాలకొల్లు బంగారుచెరువు గట్టు ప్రాంతంలో దాదాపు వంద మంది వరకు కేటరింగ్ నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే వీరిలో చాలామంది సంక్రాంతి కోడి పందేల బరులు, సంపన్నుల ఇళ్లు, అతిథి గృహాలు, విల్లాల వద్ద ప్రత్యేక వంటలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్లిపోయారు. ⇒ కాకినాడ జిల్లా వేళంగి గ్రామం కూడా వంట మేస్త్రీలకు ప్రసిద్ధి. ఇక్కడ 150 మందికి పైగానే వంట మేస్త్రీలు ఉంటారు. రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్లి విభిన్న రకాల వంటలు వండి వడ్డిస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికీ డిమాండ్ ఎక్కువగా ఉంది.⇒ భీమవరం సమీపంలోని చినఅమిరంలో ఆర్డర్లపై పిండి వంటలు తయారుచేసే వారున్నారు. ఎన్ని వెరైటీలు కావాలన్నా సమయానికి అందజేస్తారు. కాళ్ల మండపం కోపల్లె, తణుకు మండలం వేల్పూరు గ్రామాల్లో పిండి వంటలు తయారు చేసే మహిళలు ఎక్కువ. సంక్రాంతి రోజుల్లో ఆర్డర్లపై దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి పిండి వంటలు సిద్ధం చేసి ఇస్తుంటారు.⇒ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పలు పేద కుటుంబాల వారు హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లోని విల్లాలు, అపార్ట్మెంట్లు, ఆఫీసుల వద్ద వాచ్మెన్లుగా కొనసాగుతుంటారు. సంక్రాంతి పండుగకు కుటుంబం మొత్తం స్వస్థలాలకు వారం, పది రోజులు ఉండేలా వస్తుంటారు. అలాంటి వారిలో ప్రావీణ్యమున్న వారు వంటలు చేయడానికి, సహాయకులుగా ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. ⇒ వంటలు చేయడంలో ఆరితేరిన మేస్త్రీలు, సహాయకులకు ఇంతగా డిమాండ్ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ప్రావీణ్యమున్న పలువురు పండుగ సమయంలో తమ కుటుంబీకులు, స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎంత డబ్బులు ఇస్తామన్నా వంట పనికి వెళ్లరు. దీంతో పనికి సిద్ధపడే వారు కొద్దిరోజులకే జాక్‌పాట్ కొట్టినట్టే.వంట మేస్త్రీలను ఏర్పాటు చేసుకుంటాం మా ముగ్గురు కుమారు ల కుటుంబ సభ్యు లతో పాటు బంధుమిత్రులు 40 మంది వరకు పండగ కు ఇంటికి వస్తుంటా రు. వారికి ఏ లోటూ లేకుండా అవసరమైన వంటలు సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా వంట మేస్త్రీలను ఏర్పాటు చేసుకుంటాం. పనుల్లో వారికి మా కుటుంబ సభ్యులు సహకరిస్తుంటారు. వంట మేస్త్రీ ఒకరికి పండుగ మూడు రోజులకు రూ.10 వేలు వరకు ఇస్తాం. – చవ్వాకుల సత్యనారాయణమూర్తి, ఆక్వా రైతు, తోలేరు, పశ్చిమ గోదావరి జిల్లాఇందుపల్లి వంటవారు ప్రత్యేకంవంటలు చేయడంలో కృష్ణా జిల్లా ఇందుపల్లి వారికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కృష్ణాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇందుపల్లి వంటలకు ప్రాధాన్యమిచ్చి పిలిపించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా అనేక ప్రాంతాల వారి నుంచి పిలుపులు వచ్చాయని ఇందుపల్లి ఎంపీటీసీ సభ్యుడు, వంట మేస్త్రీ అయిన కూరాకుల వెంకట్రామయ్య తెలిపారు. తమ బృందం కూడా నాలుగు రోజుల వంటలకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. -
నల భీముల ‘వంట’ పండింది
కేవలం నాలుగు రోజులు వంట పని. ఉదయం సుమారు 500 మందికి టిఫిన్.. 1,500 నుంచి 2 వేల మందికి నాన్ వెజ్ వంటకాలతో మధ్యాహ్న, రాత్రి భోజనం.. సాయంత్రం స్నాక్స్. ఇవన్నీ చేయడానికి ఆరేడుగురు వంట మేస్త్రీలు, మాస్టర్లు, మహిళలు సహా పదిమందికి పైగా సహాయకులు. రోజుకు కనీసం రూ.50 వేల చొప్పున సంక్రాంతి పండుగ మొత్తం రూ.2 లక్షలకు మించి వెచ్చించే తరుణమిది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి–మాదలవారిగూడెం సమీపంలో కోడి పందేల బరివద్ద ఏర్పాట్ల కోసం ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన వారితో కుదుర్చుకున్న ఒప్పందమిది.సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వంటల్లో చేయితిరిగిన నలభీములకు సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటవుతున్న బరుల వద్ద పైతరహా ఒప్పందాలు జరిగాయి. సంప్రదాయ పిండి వంటలు, తీపి పదార్థాలు చేయడంలోనూ అనుభవజ్ఞుల పంట పండుతోంది. నాన్ వెజ్ వంటకాల్లో ప్రావీణ్యం ఉన్న ఒక్కో వంట మాస్టర్‌కు రోజుకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు సమకూరుతోంది. నగరాలు, పట్టణాల్లోని హోటళ్లలో పనిచేస్తున్న మాస్టర్లు కొందరు స్వస్థలాలకు వెళ్లి వస్తామంటూ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకుని వెళుతున్నారని ఆయా హోటళ్ల నిర్వాహకులు, యజమానులు చెబుతున్నారు.కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కోససంక్రాంతికి ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్లు, బంధువులు, స్నేహితులకు వివిధ రకా ల విందు భోజనాలు ఏర్పాటు చేయా లని సంపన్నవర్గాల వారు తహతహ లాడుతుంటారు. అల్లుళ్లకు మర్యాదలు చేయడంలో గోదారోళ్ల స్టైలే వేరు. కృష్ణా, గుంటూరు వాళ్లదీ అదే తీరు. వందల రకాలు వడ్డించడం వారికొక సరదా. గతేడాది ఏలూరు జిల్లాలో కొత్త అల్లుడికి 379 రకాల పదార్థాలు వడ్డించిన కుటుంబం వార్తల్లో నిలిచింది. వంద రకాలకు పైగా స్వీట్లు, నలభై రకాలకు మించి స్నాక్స్, నలభై రకాల కూరలు, ఇరవై రకాల చట్నీలు.. ఇలా విభిన్న పదార్థాలు విస్తరిలో వడ్డించి తమ ప్రేమాభిమానా లను చాటుకున్నారు.ఇలాంటివి పలు చోట్ల చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చా యి. మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, కొరమీను, మెత్తళ్లు, నల్లసందువా తది తర చేపలతో వెరైటీలు చేయగలిగిన వారిని సంపన్న కుటుంబాల వారు రోజుకు లేదా గుంపగుత్తగా రూ.వేలల్లో చెల్లించి నియమించుకుంటున్నారు. వా రం నుంచి పక్షం రోజుల వరకు ఇళ్లల్లోనే ఉండి కావాల్సిన వెరైటీ వంటలు చేయా ల్సి ఉంటుంది. రోజుకు వేతనం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నా రని, సహాయకుడికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారని పాల కొల్లుకు చెందిన కేటరింగ్ నిర్వాహకుడు మజ్జి శ్రీనివాస్ వివరించారు.దమ్ చేయడం తెలిస్తే..మటన్, బికెన్ దమ్ బిర్యానీ చేయడంలో ఆరితేరిన వారికి మంచి డిమాండ్ ఉందని విజయవాడలో పలు హోటళ్లు నిర్వ హిస్తున్న మనోహర్ ‘సాక్షి’కి చెప్పారు. ఏదైనా ఒక ఈవెంట్ కోసం 2 వేల మందికి స్పెషల్స్ చేయడానికి మాస్టర్ రూ.6 వేల నుంచి రూ.7 వేలు తీసుకుంటారని, సంఖ్య అంతకు మించితే మరో మాస్టర్‌కు అంతే మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మాస్టర్లకు, వారి సహాయకులకు వసతి, భోజనం, రవాణా వసతి అదనం. వివాహాలు, ఈవెంట్ల కోసం రెండు రకాల వెరైటీ స్వీట్స్ చేసే వారికి కూడా మంచి డిమాండ్ ఉందని వివరించారు.ఇందుపల్లి వంటవారు ప్రత్యేకంవంటలు చేయడంలో కృష్ణా జిల్లా ఇందుపల్లి వారికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కృష్ణాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇందుపల్లి వంటలకు ప్రాధా న్యమిచ్చి పిలిపించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా అనేక ప్రాంతాల వారి నుంచి పిలుపులు వచ్చాయని ఇందుపల్లి ఎంపీటీసీ సభ్యుడు, వంట మేస్త్రీ అయిన కూరాకుల వెంకట్రామయ్య తెలిపారు. తమ బృందం కూడా నాలుగు రోజుల వంటలకు ఒప్పందం కుదుర్చు కుందన్నారు. అలాగే పాలకొల్లు బంగారుచెరువు గట్టు ప్రాంతంలో దాదాపు వంద మంది వరకు కేటరింగ్ నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే వీరిలో చాలామంది సంక్రాంతి కోడి పందేల బరులు, సంపన్నుల ఇళ్లు, అతిథి గృహాలు, విల్లాల వద్ద ప్రత్యేక వంటలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్లిపోయారు.⇒ కాకినాడ జిల్లా వేళంగి గ్రామం కూడా వంట మేస్త్రీలకు ప్రసిద్ధి. ఇక్కడ 150 మందికి పైగానే వంట మేస్త్రీలు ఉంటారు. రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్లి విభిన్న రకాల వంటలు వండి వడ్డిస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికీ డిమాండ్ ఎక్కువగా ఉంది.⇒ భీమవరం సమీపంలోని చినఅమిరంలో ఆర్డర్లపై పిండి వంటలు తయారుచేసే వారున్నారు. ఎన్ని వెరైటీలు కావాలన్నా సమయానికి అందజేస్తారు. కాళ్ల మండపం కోపల్లె, తణుకు మండలం వేల్పూరు గ్రామాల్లో పిండి వంటలు తయారు చేసే మహిళలు ఎక్కువ. సంక్రాంతి రోజుల్లో ఆర్డర్లపై దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి పిండి వంటలు సిద్ధం చేసి ఇస్తుంటారు.⇒ వంటలు చేయడంలో ఆరితేరిన మేస్త్రీలు, సహాయకులకు ఇంతగా డిమాండ్ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ప్రావీణ్యమున్న పలువురు పండుగ సమయంలో తమ కుటుంబీకులు, స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎంత డబ్బులు ఇస్తామన్నా వంట పనికి వెళ్లరు. దీంతో పనికి సిద్ధపడేవారు కొద్దిరోజులకే జాక్‌పాట్ కొట్టినట్టే. -
తరుణ్ సంచలనం
గువాహటి: కీలకదశలో పాయింట్లు సాధించిన తెలంగాణ బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించాడు. గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ (భారత్)ను బోల్తా కొట్టించి తరుణ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ తరుణ్ 24–22, 15–21, 21–13తో ప్రియాన్షును మట్టికరిపించాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తరుణ్ మూడు గేమ్ పాయింట్లను కాచుకొని గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రియాన్షు తేరుకోగా... నిర్ణాయక మూడో గేమ్‌లో తరుణ్ పైచేయి సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)తో తరుణ్ తలపడతాడు. భారత్‌కే చెందిన సతీశ్ కుమార్, రవి, ఆయుశ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పోరాడి ఓడిన శ్రియాన్షి మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. వు లువో యు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రియాన్షి 21–19, 12–21, 12–21తో ఓడింది. భారత్‌కే చెందిన మాన్సి సింగ్, తన్వీ శర్మ, అన్మోల్ ఖరబ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప; ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; రోహిత్–రిదువర్షిణి; అశిత్–అమృత; కనపురం సాతి్వక్ రెడ్డి–వైష్ణవి జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. -
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్‌ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల -
క్వార్టర్ ఫైనల్లో సింధు
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో రెండో సీడ్, భారత స్టార్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–12తో హువాంగ్ యు సున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్ ఆరంభంలో కాస్త పోటీ ఎదురైంది. స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ సుపనిదతో సింధు ఆడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–3తో ఆధిక్యంలో ఉంది. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ ద్వయం 22–20, 21–18తో ప్రెస్లీ స్మిత్–అలీసన్ లీ (అమెరికా) జంటపై గెలిచింది. అశ్విని–తనీషా జోడీ గెలుపు మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా జంట 21–14, 21–8తో టిఫానీ హో–గ్రోన్యా సోమర్విల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–అర్జున్ (భారత్) ద్వయం 21–17, 21–19తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్) జంటపై నెగ్గగా... గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ (భారత్) జోడీ 16–21, 21–15, 16–21తో క్రిస్టో పొపోవ్–తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
అమెరికా డ్రీమ్స్.. ఇదీ రియాల్టీ
అమెరికాలో మాస్టర్స్ చేసే ఓ ఇండియన్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అతడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిలిం ‘మాస్టర్స్’. వంశీకృష్ణ అచ్చుత హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ లఘు చిత్రానికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘చాలా మంది ఎన్నారైలు నా షార్ట్ ఫిలింపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికానే కాదు..కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఫోన్ చేసి ఫిలిం బాగుందని మెచ్చుకుంటున్నారు. నేను కూడా మాస్టర్స్ కోసం.. మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు తమని తాము సినిమాలో చూసుకుంటున్నట్లుగా ఉందని చెప్పడం ఆనందంగా ఉంది. నేను కూడా మాస్టర్స్ కోసమే 21 ఏళ్ల వయసులో యూఎస్ వచ్చాను. నాతో పాటు నా స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతోనే ఈ లఘు చిత్రాన్ని తీర్చిదిద్దాను. గన్ కల్చర్‌ని ఇందులో కవర్ చేశాం. చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చిన విదేశీయులను ఎందుకు చంపుతున్నారు? విదేశాల్లో ఒక అమ్మాయి చనిపోతే బాధపడకపోగా, ఇండియాను వదిలి ఎందుకు వెళ్లాలి? డబ్బు కోసం తెల్లోడి బూట్లు నాకాలా? అంటూ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. రిచ్ లైఫ్ కోరుకోవడం తప్పా? ఓ మధ్య తరగతికి చెందిన వాడు రిచ్ లైఫ్‌ని కోరుకోవడం తప్పా? తన పేరెంట్స్‌ని కార్లలో తిప్పాలని కోరుకోవడం తప్పా? ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికాలో చనిపోతే వాళ్ల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇవేమీ ఆలోచించరు, నోటికొచ్చింది మాట్లాడుతారు. ఎంతోమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో పిట్టల్లా రాలిపోతున్నా ఇప్పటివకు ఒక్కటంటే ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయలేదు. ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? అని ఆరా తీసి వాటిపై అవగాహన కల్పిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడుకోగలుగుతాం' అని ఎమోషనల్ అయ్యాడు వంశీకృష్ణ. -
ఎమ్మెస్.. టైమ్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్వేర్ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు. సమయం వృథా ఎందుకుని.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్‌లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది. మరో వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్‌లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లభించని బ్యాంకు రుణాలు విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్‌టైం జాబ్ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఐటీ కోలుకోవడంపైనే ఆశలు బీటెక్ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్ (అమెరికా వెళ్ళిన వరంగల్ విద్యార్థి) ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చారు బీటెక్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్‌లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్ కుమార్ (యూఎస్ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్ విద్యార్థి) -
మా సమస్యలు పరిష్కరించండి
భానుగుడి (కాకినాడ) : కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని రాజీవ్ విద్యామిషన్ పీవో మేకా శేషగిరిని ఆర్వీఎం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆసోసియేషన్ సభ్యులు కోరారు. సోమవారం పీవోను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 2012 నుంచి పనిచేస్తున్న ఆర్వీఎం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , ఫిజికల్, వర్క్ ఎడ్యుకేషన్ కాంట్రాక్టు ఉపాధ్యాయులను పాఠశాలల్లో 100 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట తీసేశారని, జిల్లాలో ప్రస్తుతం ఏర్పడిన ఖాళీలను వారితో భర్తీ చేయాలని కోరారు. ఈ విద్యాసంవత్సరంలో పక్క జిల్లాల్లో జూ¯ŒS 16నుంచి వేతనాలిస్తే మన జిల్లాలో జులై 4నుంచి వేతనాలిచ్చారని, ఇక్కడా అదే తరహా నిబంధనను అమలు చేయాలని కోరారు. పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. పీవోను కలిసినవారిలో ఏఎంవో చామంతి నాగేశ్వరరావు, ఆ సంఘం జిల్లా అ««దl్యక్షుడు ఎన్. రాజేంద్రప్రసాద్, సీహెచ్ఎన్.రవి,రాధాకృష్ణ, ప్రసన్నకుమార్ అసిస్టెంట్ ఏఎంవో ఎన్ .రాజేంద్రప్రసాద్ ఉన్నారు. -
ఉపాధ్యాయులు లేని చదువులా?: రాజేశ్వరి
రంపచోడవరం: పెదగెద్దాడ వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మార్చి రెండునెలలైనప్పటికీ అక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంపై ఎమ్మెల్యే రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం ఆ పాఠశాలను సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలోని 14 ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ అమలులో కక్కుర్తి పడితే సహించేది లేదన్నారు. ప్రజాదర్బారుతో ప్ర యోజనమేంటి? గిరిజనుల సమస్యలను పరిష్కరిం చలేని ప్రజాదర్బారును నిర్వహించడంతో ఎవరికీ ఉపయోగం లేదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకంలో వాచ్ అండ్ వార్డులో జీడిమామిడి మొక్కలను సంరక్షించుకున్న గిరిజన రైతులకు మూడేళ్లుగా వేతనాలు చెల్లించడం లేదని ఎమ్మె ల్యే ఆరోపించారు. వారు వేతనాలు ఇ ప్పించాలంటూ పదేపదే ప్రజాదర్బారులో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బారులో గిరిజన రైతులతో కలిసి ఆమె ఆ విషయంలో అధికారులను నిల దీశారు. ఇప్పటికైనా అధికారులు వారి వే తనాల చెల్లింపునకు చర్యలు తీసుకోకుంటే ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తామన్నారు. ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన స్దానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లను పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజేశ్వరి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాజంనేయులు, సర్పంచ్ పండా రామకృష్ణదొర, ఎంపీటీసీ సభ్యులు కారుకోడి పూజా తదితరులు ఉన్నారు. -
భాషా పండితులతో ఐఎస్ఐ శిక్షణ
బరేలి: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో తన కార్యకలాపాల నిర్వహణకు భాషా పండితులను నియమించుకొని తమవారికి శిక్షణ ఇప్పిస్తోంది. ఈ విషయం ఇటీవల అరెస్టైన ఐఎస్ఐ గూఢచారి మహ్మద్ ఇజాజ్ విచారణలో వెల్లడైంది. భాషలో శిక్షణ కోసం భారత్‌కు చెందిన భాషా పండితులను ఐఎస్ఐ నియమించుకుంటోంది. ఇజాజ్‌కు భారత్‌లోని హిందీ మాండలికంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన ఇజాజ్‌కు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన స్థానిక యాసలో మాట్లాడేలా శిక్షణ ఇచ్చారు. 'ఐఎస్ఐ నన్ను రిక్రూట్ చేసుకున్న తరువాత నేను మాట్లాడే పంజాబీ యాస గురించి ఆందోళన చెందారు. అందుకే భాషా పండితునితో శిక్షణ ఇప్పించాక భారత్‌కు పంపారు' అని విచారణలో ఇజాజ్ వెల్లడించాడు. భారత్‌కు వచ్చిన తర్వాత కూడా మరోసారి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపాడని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ అధికారి అజయ్ పాల్ సింగ్ వెల్లడించారు. ఐఎస్ఐ శిక్షణలో భాగంగా కంప్యూటర్, వీడియో గ్రఫీతో పాటు భారత సంస్కృతి, సాంప్రదాయలపై కూడా అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఇజాజ్‌కు ఉర్దూ, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉందని అధికారులు వెల్లడించారు. -
ముగిసిన డీపీఎస్ క్రీడా సంబరం
రాయదుర్గం, న్యూస్‌లైన్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఖాజాగూడలోని డీపీఎస్ స్కూల్లో రెండు రోజులుగా ‘యుఫోరియా’ పేరిట వార్షిక అంతర్ పాఠశాలల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని 25 పాఠశాలలకు చెందిన 171 మంది విద్యార్థులు క్రికెట్, అథ్లెటిక్స్ పోటీలతోపాటు సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, ప్రిన్సిపల్ రేఖా అగర్వాల్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రమ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.