సార్వత్రిక సమ్మెకు మెడికల్ రెప్స్ మద్దతు
Published Mon, Aug 29 2016 12:37 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
కర్నూలు(హాస్పిటల్) : వచ్చే నెల2న జరగనున్న సార్వత్రిక సమ్మెకు ఏపీ మెడికల్ రెప్స్ అండ్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ మద్దతు ఇస్తున్నట్లు సంఘం శాఖ జిల్లా కార్యదర్శి షేక్‌షావలి చెప్పారు. ఆదివారం యూనియన్ కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి కార్పొరేట్ సంస్థలకు కోట్లాది రూపాయల ఆదాయం పెంచుతూ, కార్మికులకు విపరీతమైన నష్టం చేకూరుస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని కార్మిక చట్టాలను కుదించి కొత్తగా కేవలం 5 లేబర్ కోడ్‌లుగా ప్రవేశపెట్టడం అన్యాయమని చెప్పారు. అత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఉద్యోగ అవకాశాలు పెంచాలని, కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్‌ల రిజిస్ట్రేషన్ 45 రోజుల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శులు రవీంద్రారెడ్డి, బసవరాజు, ఉపాధ్యక్షులు మౌనుద్దీన్, కోశాధికారి పుల్లయ్యశాస్త్రి పాల్గొన్నారు.
Advertisement
Advertisement