వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితి
Published Mon, Jun 5 2017 11:19 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
కర్నూలు(హాస్పిటల్): కర్నూలుకు చెందిన వైద్య విద్యార్థి ఒకరు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎన్‌ఆర్‌పేటకు చెందిన రామకృష్ణ ఫార్మాసిటికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన జయసాయికృష్ణ(20) అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్థానిక కార్బైడ్ ఫ్యాక్టరీ వద్ద రైలుపట్టాలపై అతను శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. సాయంత్రం అతని మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. సెలవులు ముగియడంతో ఆదివారం అనంతపురం బస్సెక్కించి çకళాశాలకు తల్లిదండ్రులు పంపించారు. అయితే సోమవారం ఉదయం అతను శవమై కనిపించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను ఫెయిలవుతానేమోనన్న ఆందోళన సైతం తమతో వ్యక్తం చేసేవాడని, తామే ధైర్యం చెప్పి పంపించామని, తీరా తమ కుమారుడు శవమై కనిపించాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement