ఆటో ఢీకొని మెడికో దుర్మరణం
-
కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు
-
శోకసంద్రంలో సహచర విద్యార్థులు
నెల్లూరు (క్రైమ్) : మోటారు బైక్‌ను ఆటో ఢీకొనడంతో ఓ వైద్యవిద్యార్థిని దుర్మరణం పాలైంది. ఆమెతో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన అపోలో హాస్పిటల్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ మండలం పెద్దచెరుకూరుకు చెందిన పి. చంద్రశేఖర్‌రెడ్డి, దేవసేనమ్మ దంపతులులకు సుకీర్తి(21), ప్రణీత్ పిల్లలు. శేఖర్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తె సుకీర్తి నారాయణ మెడికల్ కళాశాలలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటుంది.
రెండు నెలల కిందట సుకీర్తి తల్లిదండ్రులను ఒప్పించి హీరో మెస్ట్రా బైక్‌ను కొనుగోలు చేసింది. గురువారం బైక్‌ను ఇంటి వద్ద నుంచి హాస్టల్‌కు తీసుకువచ్చింది. గురువారం రాత్రి కళాశాల నుంచి మాగుంట లేఅవుట్‌లోని బంధువులు ఇంటికి బయలు దేరింది. అదే కళాశాలలో నెట్‌వర్క్ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న భక్తవత్సలనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ ఆమెను హరనాథపురం సెంటర్ వరకు లిఫ్ట్ అడిగాడు. దీంతో ఆమె అతన్ని బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరింది. హరనాథపురం దర్గా వద్దకు చేరుకునేసరికి ఎదురు వీధిలో నుంచి ఓ ఆటో మితిమీరిన వేగంతో వచ్చి బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న సుకీర్తి కిందపడటంతో ఆమె తలకు తీవ్రగాయం కాగా సల్మాన్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో సల్మాన్ ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ట్రాఫిక్ డీఎస్పీ నిమ్మగడ్డ రామారావు, ఎస్‌ఐ వీరనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచార ం అందించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సుకీర్తి సహచర విద్యార్థులు పెద్దఎత్తున అపోలో హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సహచర విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం వరకు తమతో గడిపిన సుకీర్తి ఇక లేదన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. బాధిత కుటుంబ సభ్యుల రోదన చూపురులను సైతం కంటతడి పెట్టించింది. సుకీర్తిని వైద్యురాలిగా చూడాలన్న తమ కల కల్లగానే మిగిలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి సౌత్ ట్రాఫిక్ ఎస్‌ఐ వీరనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.