- జాబ్‌మేళాలో పొంతనలేని ఉద్యోగాల సంఖ్య
- రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు వచ్చాయన్న లోకేష్
- పెదవి విరుస్తున్న నిరుద్యోగులు
- ఎన్నికల స్టంట్ చేస్తున్న అధికార పార్టీ నేతలు
మెగా మేళా.. మహా మాయ
Published Sat, Dec 17 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ ఎన్నికల ఊదరగొట్టిన తెలుగుదేశం పార్టీ.. ఆ హామీని నెరవేర్చకపోవడంతో తమను మోసం చేశారన్న ఆవేదన, ఆగ్రహం నిరుద్యోగ యువతలో గూడుకట్టుకుని ఉంది. ఇంటికో ఉద్యోగం, లేదంటే ప్రతి నెలా రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా నేటి వరకు అమలు చేయలేదు. దీంతో యువతలో వ్యతిరేకత వస్తుందన్న భయంతో అధికారపార్టీ నేతలు మెగా జాబ్ మేళాల పేరుతో యువతలో ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వేలల్లో ఉద్యోగాలు అంటూ ప్రచారం చేస్తూ యువతకు నిరుద్యోగ యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
– సాక్షి, రాజమహేంద్రవరం
వికాస సంస్థ, నన్నయ్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగిన మెగా జాబ్ మేళాను అధికార పార్టీ నేతలు తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా నన్నయ యూనివర్సిటీ, వికాస సంస్థ పేర్లు, లోగోలు కనపడకపోవడం గమనార్హం. అదేవిధంగా జాబ్‌ల సంఖ్యపై ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రకటించారు. నిర్వాహకులు 6 వేలు, నారా లోకేష్ సభావేదికపై 10 వేలు, విలేకర్లతో మాట్లాడుతూ 8 వేలు అంటూ పలు రకాలుగా లెక్కలు చెప్పారు. చివరి రోజు నిర్వాహకులు 7,300 అంటూ మరో లెక్క చెప్పడం యువతకు తాము వేల ఉద్యోగాలు ఇప్పించేస్తున్నామనే భ్రమలు కలిగించే ప్రయత్నం చేశారు.
అందుకేనా ఈ మేళాలు
‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని ప్రాసతో అ«ధికార పార్టీ నేతలు ఎన్నికల్లో హోరెత్తించగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ‘బాబు వచ్చాడు, జాబులు పోతున్నాయి’ అన్న ప్రాసతో ఎద్దేవా చేస్తున్నారు. ఇందుకు అన్ని శాఖల్లో ఔట్‌స్సోర్సింగ్ ఉద్యోగులను విడతల వారీగా తొలగించడాన్ని ఉదహరిస్తున్నారు. ‘నాన్నగారు రెండేళ్లో గట్టిపునాది వేయబట్టే ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయి’ అని శుక్రవారం జాబ్‌మేళా ప్రారంభించిన అనంతరం నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం జాబ్‌మేళాలో 6 వేల ఉద్యోగాలు ఉన్నాయంటూ కంపెనీలు వివరాలు కరపత్రంలో పొందుపరిచారు. ఇందులో దాదాపు 5,700 ఉద్యోగాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న కంపెనీల్లోను ఉన్నాయి. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో మిగతా 300 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కూడా పదో తరగతి విద్యార్హతతో వచ్చే ఉద్యోగాలు కావడం గమనార్హం. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నిర్వాహకులు ఇచ్చిన కరపత్రంలోని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది. రెండేళ్లలో రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రాకుండానే ప్రైవేటు రంగంలో కొత్తగా లక్ష ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో అర్థం కావడంలేదని యువత ప్రశ్నిస్తోంది. నాలుగు రోజుల ముందుగానే వికాస సంస్థ వెబ్‌సైట్‌లో ఆ¯ŒSలై¯ŒS రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న నిరుద్యోగులు తిరిగి మైదానంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పడంతో క్యూలైన్లలో నిలబడి అష్టకష్టాలు పడ్డారు. ఇంత చేసినా వారికి ఇచ్చింది కంపెనీల వివరాలతో కూడిన కరపత్రం మాత్రమే. అందులో వివరాలు చూసి తాము ఎలాంటి ఉద్యోగానికి సరిపోతామో చూసుకుని ఆయా కంపెనీల ఇంటర్వూ్యలకు వెళ్లాలి. అదేదో ఆ¯ŒSలై¯ŒSలో రిజిస్ట్రేష¯ŒS చేసుకోని వారికి పెడితే తమకు కొంతమేరకైనా ఎండలో నిలబడే బాధ తప్పేదంటున్నారు.
24 వేల మందిలో 6 వేల మంది దొరకలేదా?
మొత్తం 6 వేల ఉద్యోగాలున్నాయని నిర్వాహకులు ప్రకటించారు. రెండు రోజుల్లో 24,173 మంది ఇంటర్వూ్యలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తంమీద 3,520 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంటే హాజరైన నిరుద్యోగుల్లో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినట్లు ఆఫర్ లెటర్లు ఇచ్చారు. జాబ్‌మేళాకు విస్తృత ప్రచారం చేయడంతో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వ్యయప్రయాసలకోర్చి నిరుద్యోగులు హాజరయ్యారు. నిర్వాహకులు ప్రకటించిన కరపత్రంలోని ఉద్యోగాలలో దాదాపు 90 శాతం నా¯ŒS టెక్నికల్ ఉద్యోగాలే. అలాంటప్పడు 24 వేల మందిలో అర్హతున్న వారు 25 శాతం కూడా లేరా? అని నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినా ఎంపిక కాకపోవడంతో తమలోని ఆత్మ స్థయిర్యం దెబ్బతింటోందని శ్రీకాకుళం నుంచి వచ్చిన నిరుద్యోగ యువకుడు ఎర్రన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Advertisement
Advertisement