‘డబుల్’కు డబ్బులడిగితే చెప్పుతో కొట్టండి: కేటీఆర్
హన్మకొండ: డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బు లు అడిగితే వారిని చెప్పుతో కొట్టాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగం గా వరంగల్, హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ఇళ్లను చూసి కొందరు పైరవీకారులు సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ముంబైకి దీటుగా పుణే, బెంగళూర్‌కు దీటుగా మైసూర్‌ను అభివృద్ధి చేసినట్లుగానే హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను శాటిలైట్ నగరంగా అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని వివరించారు. వచ్చే ఐదేళ్లలో రూ. 2 వేల కోట్లతో వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో ముందుం చుతామన్నారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్న గత పాలకులు చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ వస్తే చీకట్లేనని మాట్లాడిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే చీకట్లోకి వెళ్లారని దుయ్యబట్టారు. నీచ రాజకీయూలు చేసే సన్నాసులకు ఓటెస్తారో, గులాబీని ముద్దాడుతారో వరంగల్ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.