
'నిరాహారదీక్ష ఎందుకో ముద్రగడ చెప్పాలి'
విజయవాడ: ముద్రగడ పద్మనాభం ఎందుకు నిరాహార దీక్షకు దిగుతున్నారో స్పష్టం చేయాలని మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చే 30 నంబరు జీవో వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఈ రోజు సాయంత్రం కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకుంటే ఈ నెల 5 నుంచి తన సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం సోమవారం ప్రకటించిన నేపథ్యంలో నారాయణ స్పందించారు.
కాగా, సీఆర్ డీఏ పరిధిలో రహదారుల కోసం 6 గ్రామాల్లో 1200 ఇళ్లు తొలగించాల్సివుంటుందని తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పై చర్చించేందుకు రేపు సింగపూర్ బృందం వస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్ గడువును మరో వారం పాటు పోడిగించినట్టు చెప్పారు.