థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించండి
Published Mon, Jul 25 2016 12:30 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
మంత్రి అచ్చెన్నాయుడు
డీఎల్‌పురం(పోలాకి): పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి స్థానికులు హకరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఆదివారం మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన డీఎల్‌పురంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. కొంతమంది కావాలనే స్థానికుల్లో లేనిపోని భయాలు కలిగిస్తున్నారని మంత్రి అన్నారు. అనేక అభివృద్ధి ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయని చెప్పారు. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో పవర్‌ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంతం నుంచే తనకు ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పుకొచ్చారు. యువత ఉపాధి ఉద్యోగావకాశాల కోసమే భావనపాడు ఓడరేవు, కొవ్వాడ అణుప్లాంట్, పోలాకి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టేందుకుకృషిచేస్తున్నట్లు చెప్పారు. పోలాకి మండలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు నివేదించిన ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement