
మంత్రులు హరీశ్, ఈటెల పడవ షికారు..
లక్కెట్టిపేట్ (ఆదిలాబాద్): రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పుష్కర ఘాట్‌ను ఆదివారం సందర్శించారు. దండెపల్లిలోని గూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా పుష్కర ఏర్పాట్లు, పనులను పరిశీలించారు. అక్కడ భక్తులకు అందుతున్న వసతులను పరిశీలించారు. అనంతరం గోదావరిలో పడవపై బయల్దేరి సమీపంలోని కోటిలింగాల పుష్కరఘాట్ చేరుకున్నారు.