అతడు ఏమయ్యాడో? | MISSING MYSTERY | Sakshi
Sakshi News home page

అతడు ఏమయ్యాడో?

Published Mon, Jul 25 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

MISSING MYSTERY

  • పంట కాలువలో మోటార్‌ బైక్‌
  • పి.గన్నవరం :
    రాజవరం–పొదలాడ రోడ్డులో బెల్లంపూడి గ్రామం వద్ద ప్రధాన పంటకాలువలో సోమవారం మోటార్‌ బైక్‌ పడి ఉన్నట్టు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఈ బైక్‌ అదుపుతప్పి, పంట కాలువలోకి దూసుకువెళ్లినట్టు అనుమానిస్తున్నారు. దీనిని నడుపుతున్న వ్యక్తి కాలువలో గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. కాలువలో లభ్యమైన బైక్‌ రిజిస్ట్రేషన్‌ నం. ఏపీ5 సీక్యూ 7215గా ఉంది. రవాణా శాఖ రికార్డుల ప్రకారం వాహన యజమాని రాజమండ్రికి చెందిన వ్యక్తిగా ధ్రువీకరించుకుని, పోలీసులు ఫోన్‌ చేశారు. అయితే ఈ బైక్‌ను అతడు మరొకరికి విక్రయించడంతో రెండో వ్యక్తి వివరాలు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మోటార్‌ బైక్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement