గడ్డ కాలువలో యువకుడి గల్లంతు | men missing | Sakshi
Sakshi News home page

గడ్డ కాలువలో యువకుడి గల్లంతు

Published Fri, Sep 9 2016 9:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

men missing

మిర్తిపాడు (సీతానగరం) : 
స్నానానికి వెళ్లిన యువకుడు కాలువలో గల్లంతైన సంఘటన మిర్తిపాడు వద్ద గడ్డ కాలువలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్తిపాడు సెంటర్‌లో రాజమహేంద్రవరానికి చెందిన వెంకటేశ్వరరావు చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేట గణపతి నగర్‌ చెందిన పనగంటి సతీష్‌ (19), భారతి ఏసు అతడి వద్ద పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న 1.30  సమయంలో వారు మిర్తిపాడు గడ్డ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సతీష్‌ నీటిలో కొట్టుకుపోగా, ఏసు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఎస్సై పవన్‌కుమార్, ఏఎస్సై మావుళ్లు, వీఆర్‌ఓ రవీంద్ర పర్యవేక్షణలో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. రాత్రి వరకూ మృతదేహం లభ్యం కాలేదు. మృతుడు తండ్రి రమణ భోరున విలపించడం చూపరులను కలచివేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement