ఎమ్మెల్యే తీరు రాజ్యాంగ విరుద్ధం | mla behaviour not under the constitution | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తీరు రాజ్యాంగ విరుద్ధం

Published Tue, Aug 2 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

ఎమ్మెల్యే తీరు రాజ్యాంగ విరుద్ధం

ఎమ్మెల్యే తీరు రాజ్యాంగ విరుద్ధం

వైఎస్సార్‌ సీపీ నేత పెండెం దొరబాబు
పిఠాపురం : పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అధికారులతో వ్యవహరిస్తున్న తీరు రా జ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ఉందని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు విమర్శించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ పట్ట ణ అధ్యక్షుడు బొజ్జా రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా అధికారులతో ప్రజాసేవ చేయించాలి మినహా, వారిపై జులుం ప్రదర్శించడం మంచిపద్ధతి కాదని హి తవుపలికారు. పిఠాపురం ఎంఈఓను జాయిన్‌ చేసుకోవద్దని మరో ఉద్యోగికి ఆదేశాలివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏ అధికారి జోలికి వెళ్లి నా ఊరుకునేది లేదని, వారికి తాము అండగా ఉంటామని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యబద్ధం గా జరగాల్సిన విద్యా కమిటీ ఎన్నికలకు రాజ కీయ రంగు పులిమి.. దేశం నాయకులు పాఠశాలల్లో ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు. పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, కౌన్సిల్‌ ప్రతిపక్షనేత గండేపల్లి బాబీ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement