
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
కోదాడ: అన్నిదానాల కన్నా అన్నదానం గొప్పదని కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని 27వ వార్డులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహæ్మంగారి దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్మించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రామారావు, పి. సత్యబాబు, లక్ష్మినారాయణరెడ్డి, జూకూరి అంజయ్య, ఎన్.వి. చారి తదితరులు పాల్గొన్నారు.