ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలోనే ఉంటాం | MLA will be led srikantreddi | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలోనే ఉంటాం

Published Mon, Dec 12 2016 12:26 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలోనే ఉంటాం - Sakshi

ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలోనే ఉంటాం

గాలివీడు : ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జల్లా సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ ఉమాపతిరెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలోనే కొనసాగుతామని నూలివీడు గ్రామం కొత్తపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ బీసీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ వెంకటస్వామి, ఉపసర్పంచ్‌ కోటేశ్వర్‌రెడ్డి, పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడారు. ఒక వ్యక్తి స్వార్థంతో టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన వైఎస్‌ఆర్‌సీపీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. వ్యక్తిత్వం, విలువలు లేని వ్యక్తి పార్టీ మారినారే తప్ప, మిగితా ఎవ్వరూ వెళ్లలేదన్నారు.టీడీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా పార్టీ మారే వ్యక్తిత్వం కొత్తపల్లె ప్రజలకు లేదని పేర్కొన్నారు.  ఆదివారం మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి వస్తున్నారనే సమాచారం తెలియడంతో ప్రతి ఇంటికి తాళాలు వేసుకొని ఊరుబయట సమావేశం కావడం ఇందుకు నిదర్శనం అని మాజీ సర్పంచ్‌ వెంకటస్వామి తెలిపారు. బండి కుటుంబీకులు కూడా వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్నారని, టీడీపీ వారు కావాల్సిందిగా పుకార్లు సృష్టించి వలస పోతారని ప్రచారం చేయడం సిగ్గు చేటని అన్నారు. కార్యక్రమంలో బాబు, గంగులప్పా, సిద్దారెడ్డి, పుల్లయ్య, ప్రసాద్, ప్రతాప్‌రెడ్డి పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement