‘మత్తు’లో ఎమ్మెల్సీ తనయుడి దూకుడు | MLC's son rash driving causes heavy damage | Sakshi
Sakshi News home page

‘మత్తు’లో ఎమ్మెల్సీ తనయుడి దూకుడు

Published Tue, Feb 16 2016 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

‘మత్తు’లో ఎమ్మెల్సీ తనయుడి దూకుడు - Sakshi

‘మత్తు’లో ఎమ్మెల్సీ తనయుడి దూకుడు

ఘటనపై రహస్యం పాటిస్తున్న పోలీసులు
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ మద్దతుదారైన ఎమ్మెల్సీ అంగూరి శివకుమారి కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఆదివారం అర్ధరాత్రి కాకినాడలో దూకుడుగా కారు నడిపి  విద్యుత్ స్తంభాన్ని, రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొనడంతో పాటు రెండు ఆవుల మృతికి కారకుడయ్యూడు. కారు పల్టీ కొట్టడంతో అతడితో పాటు స్నేహితుడు సుధీర్ గాయపడ్డాడు. వారిద్దరినీ కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటన సమయంలో ప్రవీణ్‌కుమార్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. 

ప్రవీణ్‌కుమార్ జగన్నాథపురం వంతెన వైపు నుంచి వార్ఫురోడ్డులో పాతబస్టాండ్ వైపు వేగంగా కారు నడుపుతూ వచ్చాడు. అక్కడ పోలీసులు ఆపినా ఆగలేదు. కొద్ది దూరం వెళ్లాక కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రెండు ఆవులను ఢీకొట్టింది. తర్వాత  విద్యుత్తు స్తంభాన్ని, నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొని పల్టీకొట్టింది.  ఓ కారు యజమాని ఆంజనేయస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement