mpyv
ఆదర్శ గ్రామానికి ఎంపీ వైవీ రాక నేడు
Published Thu, Sep 1 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ఒంగోలు అర్బన్ : ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కడప జిల్లా ఇడుపలపాయ నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జిల్లాలోని ఆదర్శ గ్రామం దద్దవాడకు చేరుకుంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. దద్దవాడలో అధికారులతో గ్రామాభివృద్ధిపై చర్చిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు గిద్దలూరులో జరగనున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3న సీపీఓ కాన్ఫరెన్స్ హాలు జరిగే దిశా మీటింగ్‌లో పాల్గొంటారు. 4వ తేదీ యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటిస్తారు.
వికలాంగులకు స్క్రీనింగ్ క్యాంప్
ఎంపీ నిధులు.. అలిమ్‌కో సంస్థ తరుఫున వికలాంగులకు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు అందించేందుకు ఈ క్యాంప్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 8న గిద్దలూరు నియోజకవర్గంలోని కభంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో, 9వ తేదీ కనిగిరి పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో క్యాంప్‌లు జరుగుతాయి. అర్హులైన సద్వినియోగం చేసుకోవచ్చు.
Advertisement
Advertisement