231 మంది ఎంపీఈఓల జాబితా సిద్ధం
Published Wed, Jul 20 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖలో మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో) నియామకాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు 231 మందితో అర్హత జాబితా సిద్ధం చేశారు. 124 ఎంపీఈఓ పోస్టుల భర్తీకి మే మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయగా అదే నెల 29న తుది గడువులోగా 1,261 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో సాధారణ, సూపర్‌చెక్ తర్వాత 1,094 దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత ప్రతిభ, రోష్టర్, ఇతర నిబంధనల ప్రకారం 231 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించడానికి జాబితా తయారు చేశారు. కలెక్టర్ అనుమతి తీసుకుని త్వరలో అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపనున్నారు.
Advertisement
Advertisement