నల్లగొండ : నల్గొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కార్మికుల దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. అనంతరం దీక్షలోని కార్మికులు అందరిని గొల్లగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో గత ఐదు రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న దీక్షకు భగ్నం అయింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గత ఐదు రోజుల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.