
భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీస్ బందోబస్తు
సాక్షి, భువనగిరి : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం భువనగిరి పట్టణం నుంచి అలస్యంగా బస్సులు రాకపోలు సాగించాయి. ఉదయం 10 గంటలకు బస్టాండ్‌కు బస్సులు వచ్చాయి. హైదరాబాద్–వరంగల్, నల్లగొండకు వెళ్లే మార్గంలో మాత్రమే ఉదయం బస్సులు నడిచాయి. మోత్కూర్, గజ్వెల్ రోడ్డు మార్గంలో అలస్యంగా బస్సులు రావడంతో పాటు తక్కువ సంఖ్యలో బస్సులు ఉండడంతో బతుకమ్మ, దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను అశ్రయించారు. ఈ మార్గంలో అదనంగా రూ.10 నుంచి రూ. 20 వరకు చార్జీలను వసూళ్లు చేశారు. దీంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ఉదయం ఏసీపీ భుజంగరావు బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నమని చెప్పా రు. కంట్రోల్ ఉండే స్థానంలో పోలీసులు ఉంటూ బస్సుల రాకపోకల వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తం మీద నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌లో సమ్మె సందర్భంగా అంతగా ప్రయాణికులు కనిపించలేదు.
దోపిడీ చేస్తున్నారు
వ్యక్తిగత పనిమీద ఉదయం ప్రైవేట్ వాహనంలో హైదరాబాద్ వెళ్లాను. రూ.60 కిరాయి తీసుకున్నారు. సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో రూ.70 తీసుకున్నారు. ఇదేమని అడిగితే వాహనం నుంచి దిగమంటున్నారు. కిరాయి వసూలు విషయంలో ప్రైవేట్ వాహనదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. – పబ్బు మల్లేశ్, నేలపట్ల, చౌటుప్పల్
Comments
Please login to add a commentAdd a comment