ముస్లిం పర్సనల్‌ లాపై దుష్ప్రచారం | muslim womens reject uniform civil code | Sakshi
Sakshi News home page

ముస్లిం పర్సనల్‌ లాపై దుష్ప్రచారం

Published Sat, Oct 22 2016 7:12 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

ముస్లిం పర్సనల్‌ లాపై దుష్ప్రచారం - Sakshi

ముస్లిం పర్సనల్‌ లాపై దుష్ప్రచారం

విజయవాడ(లబ్బీపేట) : ముస్లిం పర్సనల్‌ లాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు ముస్లిం మహిళలు పేర్కొన్నారు. పర్సనల్‌ లాపై దేశ వ్యాప్తంగా చర్చ నేపథ్యంలో ముస్లిం మహిళల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ శనివారం లబ్బీపేటలో సమావేశమైంది. మహిళలు మాట్లాడుతూ ఇద్దరు.. ముగ్గురికి తలాక్‌ విషయంలో అన్యాయం జరిగిందనే సాకుతో దేశంలోని 25 కోట్ల ముస్లింలపై కామన్‌ సివిల్‌కోడ్‌ను రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని భావిస్తే సచార్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్‌ రీజినల్‌ ఆర్గనైజర్‌ ఫాలిమా కౌసర్, జిల్లా అధ్యక్షురాలు ఖాదితా సల్మా, ఇఖరా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సెక్రటరీ ఆయుషాతయ్యాత, స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి ఆయుషా మొయినుద్దీన్, జేఐహెచ్‌ దావా సెల్‌ ప్రతినిధి షరీఫా పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement