ప్రథమ బహుమతిని అందుకున్న జి.కుమారి
రసవత్తరంగా పద్యనాటిక పోటీలు
Published Sun, Aug 28 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
రాజాం: స్థానిక బస్టాండ్ ఆవరణతో పాటు శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన పద్యనాటిక పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉత్తరాంధ్ర స్థాయిలో స్థానిక కళాసాగర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో మూడు జిల్లాల నుంచి 20 ట్రూప్‌లు హాజరయ్యాయి. వీరిలో మొదటి బహుమతిని జిసిగడాం మండలం ఎందువ గ్రామానికి చెందిన జి.కుమారి ట్రూప్ సత్యహరిశ్చంధ్ర నాటికలో పిడకల సీను వేసి గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతిని విశాఖపట్నంకు చెందిన వంకాయల మారుతీప్రసాద్ ట్రూప్ సత్యహరిశ్చంధ్ర నాటికలో అమ్మకం సీను ప్రదర్శించి గెలుచుకున్నారు. తృతీయ బహుమతిని విజయనగరంకు చెందిన వైదాల సూరిబాబు ట్రూప్ చింతామణి నాటికలో చింతామణి పాత్ర వేసి గెలుచుకున్నారు.
అనంతరం పార్వతీపురానికి చెందిన కె.రమణ, సావిత్రి, చందన సింహాచలంలు సత్యహరిశ్చంద్రలో వారణాశి సీను, బొబ్బిలికి చెందిన ఎస్ రాము గయోపాఖ్యానంలో యుద్ధ శీను, కోటవానిపాలెంకు చెందిన జనార్ధననాయుడు శ్రీ రామాంజనేయ యుద్ధంలో యుద్ధసీను పాత్రలో అలరించి కన్సొలేషన్ బహుమతిలు అందుకున్నారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విశాఖపట్నంకు చెందిన బగాది అచ్చెన్నాయుడు, డి.జనార్ధనరావులు వ్యవహరించారు. సభాధ్యక్షులుగా మెట్ట దామోదరరావు వ్యవహరించగా కమిషనర్ పి.సింహాచలం జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో కళాకారులు శీర రామారావు, చీకటి రామారావు, అన్నెపు కామేశ్వరరావు, సలాది రామారావు, కిలారి లక్ష్మి, గట్టి పాపారావు, జాడ కొండలరావు, రెడ్డి అప్పలనాయుడు, మరిపి తిరుపతిరావు, కొలిపాక రామస్వామి, ఆర్నిపల్లి వెంకటనాయుడు, గోకవలస కృష్ణమూర్తి, మీగడ మల్లిఖార్జునస్వామి, రంప జగదీశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement