నేషనల్ టెన్నీస్ క్రీడలు
నేషనల్ టెన్నీస్ క్రీడలు
Published Thu, Jan 5 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
కావలిఅర్బన్ : ఆల్ ఇండియా టెన్నీస్ అసోసియేషన్ (ఐటా) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన నేషనల్ సిరీస్ అండర్-16 క్రీడలు హోరాహోరీగా సాగాయి. 14 రాష్ట్రాలకు చెందిన 24 మంది క్రీడాకారులు బాలుర, బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తలపడ్డారు. విట్స్ కళాశాల, జవహార్ భారతి డిగ్రీ కళాశాల, అఫిషియల్ క్లబ్ ప్రాంగణాల్లో ఈ క్రీడలు జరిగాయి. బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో అనేక మంది క్రీడాకారులు గెలుపొందారు. కవన్ సోము కుమార్ (కర్ణాటక), ఇక్బాల్ మహ్మద్‌ఖాన్ (ఏపీ)పై 6–4, 6–7 స్కోర్ తేడాతో విజయం సాధించాడు. ఎస్ భూపతి (టీఎన్), అర్తవ వీమా(ఎంపీ)పై 6–4, 6–3 తేడాతో గెలుపొందారు. అమాంక్ పటేల్ (గుజరాత్), నితిన్ ధీటా (టీఎన్)పై 6–4,6–7 తేడాతో విజయం సాధించారు. తనిష్క మల్పానీ (ఏపీ) అముర్తజాయ్ మోహంతి (ఒడిశా)పై 6–1, 6–0 తో గెలుపొందారు. విపుల్ మెహతా (ఢిల్లీ), అఖిల్‌కుమార్‌రెడ్డి(టీఎస్)పై 6–1,6–2తో విజయం సాధించాడు. ముషరత్ అర్జున్ షేక్ (ఏపీ), పూజా ఇంగాలే (ఎంపీ)పై 6–4, 6–2 తేడాతో గెలుపొందారు. అసపర్ జనరిట (ఏపీ), త్రిష వినోద్ పి (కేఎల్)పై 4–6,5–7 స్కోర్ తేడాతో గెలుపొందాడు. భక్లిభరత్ పర్వానీ (జీజే), సృజన రాయ్‌రాల(టీఎస్)పై 7–5, 7–5 తేడాతో గెలుపొందారు. హెహనా సురేష్(టీఎస్), ఆనంద్ ధర్న ముదలియార్ (సీఎల్)పై 6–4, 6–4 తేడాతో గెలుపొందాడు. టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి, అధ్యక్షుడు వినయకుమార్ రెడ్డి, టోర్నమెంట్ డైరెక్టర్ విద్యాధర్‌కుమార్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అనుమాలశెట్టి రామకృష్ణ, పీడీలు మాల్యాద్రి, కోటేశ్వరమ్మ, ప్రసాద్ రెడ్డి, విట్స్ పీడీ చిన్నా, రమణయ్య, వెక్ పీడీ భాస్కర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement