నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల దోపిడికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేతలు అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా రూరల్ మండలానికి చెందిన స్థానిక టీడీపీ నేత ఏకంగా ఆలయ ఆస్తులనే విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నరసింహస్వామి ఆలయ భూముల్లో ఉన్న టేకు చెట్లను సదరు టీడీపీ నేత అక్రమంగా విక్రయించాడు. దీనిపై ఆలయ ఈవో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ఆస్తులనే అమ్మేసిన టీడీపీ నేత
Published Tue, Apr 12 2016 8:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement