అమావాస్య చీకట్లు | New Moon hugely | Sakshi
Sakshi News home page

అమావాస్య చీకట్లు

Published Tue, Nov 1 2016 12:47 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అమావాస్య చీకట్లు - Sakshi

అమావాస్య చీకట్లు

  • చెట్టును ఢీకొన్న బైక్‌
  • ఇద్దరు యువకుల దుర్మరణం
  • రెండు కుటుంబాల్లో విషాదం
  • అనంతపురం సెంట్రల్‌ :

    ఆనందాల కేళి దీపావళి పర్వదినాన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. చెట్టును బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

    మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడమే ప్రమాదానికి కారణం. అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన టైలర్‌ సుంకన్న కుమారుడు వడ్డే శివకుమార్‌(21), వినాయక్‌నగర్‌కు చెందిన మహబూబ్‌ కుమారుడు షేక్‌ శర్మాస్‌(22) ఇద్దరూ మంచి స్నేహితులు. భవననిర్మాణంలో టైల్స్‌ పని చేసేవారు. దీపావళి సందర్భంగా ఆదివారం స్నేహితులతో కలిసి వినోదంలో మునిగిపోయారు.

    అర్ధరాత్రి వరకూ మద్యం తాగారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి వెళుతూ శ్రీకంఠం సర్కిల్‌ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు వేగంగా ఢీ కొన్నారు. తలలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్‌పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాసుపత్రికి తరలించారు. 

    పోలీసుల కథనం ఇలా ఉంటే.. మృతులిద్దరి తలలకు బలమైన గాయాలు అయ్యాయి. ద్విచక్రవాహనంతో చెట్టును ఢీకొంటే ఇంత స్థాయిలో ప్రమాదం ఎలా జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగా ప్రమాదమేనా? లేకుంటే మద్యం మత్తులో ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement