రబీ కి తొమ్మిది గంటల విద్యుత్
టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు
ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ఆదేశం -కొత్తపల్లి
కొత్తపల్లి : రబీలో వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్‌ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. కరీంనగర్‌సర్కిల్ పరిధిలోని పాత జిల్లా విద్యుత్ అధికారులతో బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌పంప్‌సెట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు డిసెంబర్ 31లోగా కనెక్షన్లు అందించాలని ఆదేశిం చారు. తరచూ ట్రాన్‌సఫార్మర్లు ఎందుకు పాడవుతున్నాయో తె లుసుకోవాలన్నారు. కొత్త సబ్‌స్టేషన్లను నిర్మించి ఓవర్‌లోడ్‌ను తగ్గించాలన్నారు. ట్రాన్‌సఫార్మర్లు పాడరుున వెంటనే మార్చేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వినియోగదారుడికి కొత్త మీటర్‌లు అందుబాటులోకి తేవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్‌ను మూసివేయాలని, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సీఎండీగా తొలిసారిగా కరీం నగర్‌కు వచ్చిన సందర్భంగా ఎస్‌ఈ కె.మాధవరావుతోపాటు ఐదు జిల్లాల అధికారులు పుష్పగుచ్ఛాలతో అభినందించారు.