
జడ్జి గారి సైకిల్ రైడ్
కాలుష్య ప్రభావాన్ని తగ్గించడానికి అందరూ బాధ్యత తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సిబ్బంది నెలలో ఒక రోజు పర్యావరణహిత రవాణాను వాడుకోవాలని నిర్ణయించారు.
శనివారం జిల్లా కోర్టు సిబ్బంది, జడ్జిలు అంతా సైకిళ్ల మీదే ఇళ్ల నుంచి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ప్రారంభించారు. ప్రతి నెలా సేవ్ ఎన్విరాన్‌మెంట్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.