
రంగారెడ్డి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
ఓ సివిల్ వ్యాజ్యం పరిష్కారం కోసం సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ప్రాంతంలో ఓ భూమికి సంబంధించి అల్లు అర్జున్ కుటుంబంపై రాహుల్‌దేవ్ అనే వ్యక్తి 2009లో కేసు దాఖలు చేశారు. ఈ కేసు పరిష్కారంలో భాగంగా సోమవారం లోక్ అదాలత్‌కు హాజరైన ఇరు పార్టీలు రాజీకి వచ్చాయి.