Ranga Reddy district court
-
డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డితో పాటుగా ఖాజా మొయినోద్దీన్ , భిక్షపతిలకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు 10 ఎకరాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశారు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి సైట్ వద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 2022 మార్చి 1, మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, రాఘవేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయ్యింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా మట్టారెడ్డే సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలను హత్య చేయాలని సుఫారీ ఇచ్చి మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఇబ్రహీం పట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై పోలీస్ శాఖ విధుల నుండి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకుంది. చదవండి: ‘మణప్పురం’లో బంగారం మాయం -
కేసు విచారణార్హతపై హైకోర్టు సందేహం
హెచ్‌సీఏ ఎన్నికలపై పిటిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఎన్నికల పర్యవేక్షణకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కింది కోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ సెయింట్ ఆండ్రూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు దయానంద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది బి.విజయసేన్‌రెడ్డి స్పందిస్తూ, జస్టిస్ లోథా కమిటీ సిఫారసుల మేరకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర రిటైర్డ్ ఎన్నికల కమిషనర్‌కు లేదా రాష్ట్ర రిటైర్డ్ ఎన్నికల కమిషనర్‌కు అప్పగించాల్సి ఉందన్నారు. అయితే కింది కోర్టు దీనికి విరుద్ధంగా అడ్వొకేట్ కమిషన్‌ను నియమించిందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి పూర్తిస్థాయిలో వాదనలు వింటానని స్పష్టం చేస్తూ కేసును సోమవారానికి వాయిదా వేశారు. -
రంగారెడ్డి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
ఓ సివిల్ వ్యాజ్యం పరిష్కారం కోసం సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ప్రాంతంలో ఓ భూమికి సంబంధించి అల్లు అర్జున్ కుటుంబంపై రాహుల్‌దేవ్ అనే వ్యక్తి 2009లో కేసు దాఖలు చేశారు. ఈ కేసు పరిష్కారంలో భాగంగా సోమవారం లోక్ అదాలత్‌కు హాజరైన ఇరు పార్టీలు రాజీకి వచ్చాయి. -
జడ్జి గారి సైకిల్ రైడ్
కాలుష్య ప్రభావాన్ని తగ్గించడానికి అందరూ బాధ్యత తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సిబ్బంది నెలలో ఒక రోజు పర్యావరణహిత రవాణాను వాడుకోవాలని నిర్ణయించారు. శనివారం జిల్లా కోర్టు సిబ్బంది, జడ్జిలు అంతా సైకిళ్ల మీదే ఇళ్ల నుంచి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ప్రారంభించారు. ప్రతి నెలా సేవ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
డ్రంకన్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులు నమోదు
హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులను నమోదు చేశారు. అనంతరం వారిని బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ పుష్పాదేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధించారు. అతిగా మధ్యం సేవించిన ముగ్గురికి 2 రోజుల జైలుశిక్ష విధించారు. -
నారా లోకేష్‌పై కేసు
టీఆర్ఎస్వీ ఫిర్యాదుతో నమోదు చేసిన పోలీసులు నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ ఈనెల 15న చేసిన ఫిర్యాదు మేరకు 504, 505, 66/ఏ, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో హిట్లర్ పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి పత్రికలో, తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారంటూ ట్విట్టర్లోను లోకేష్ పేర్కొన్నాడని రాంనర్సింహగౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అవమానపర్చడమేనని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ద్వేషాన్ని నింపుతూ రెచ్చగొట్టేలా వాఖ్యలు చేసిన లోకేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సీఐని కోరారు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని కేసు నమోదు చేశామని, ఈ కేసును సైబరాబాద్ క్రైం విభాగానికి అప్పగిస్తామని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేయండి: మెజిస్ట్రేట్ రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణలో ప్రభుత్వాన్ని రౌడీలు నడుపుతున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించారు. లోకేష్ వాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్ ఆర్టీసీకాలనీకి చెందిన న్యాయవాదులు రవికుమార్, అభిలాష్‌రావు మంగళవారం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీ కరించిన సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యూసుఫ్... 153ఏ, 153బీ, 295, 120బీ భారతీయ శిక్ష్మాస్మృతి కింద లోకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నారా లోకేశ్ పై కేసు నమోదు చేయండి: కోర్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ పై కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం ఆదేశించింది. న్యాయవాది రవికుమార్ ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, శాంతిభద్రతలు అదుపుతప్పి పోయాయని, హిట్లర్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ట్విటర్ లో లోకేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన లోకేశ్ పై బంజారాహిల్స్, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. (కేసీఆర్ హిట్లర్‌లా పాలిస్తున్నారు: లోకేష్)