ఉపాధి పనులు పరిశీలన | nregs works visits | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులు పరిశీలన

Published Tue, Sep 5 2017 11:06 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

ఉపాధి పనులు పరిశీలన

ఉపాధి పనులు పరిశీలన

కంబదూరు: మండలంలో ఉపాధి హామీ పథకం కింద 2016, 17, 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.16 కోట్లతో చేపట్టిన ఫారంపాండ్లు,హార్టికల్చర్,మట్టి రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్,వ్యక్తిగత మరుగుదొడ్లు,వర్మీకంపోస్టు, చెరువులో పూడికతీత తదితర పనులను మంగళవారం స్టేట్‌ బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని ములకనూరు వద్ద చేపట్టిన పనులను స్టేట్‌ బృందం సభ్యులు రాంప్రసాద్, గోవర్ధన్, సాయికిశోర్, భాగ్యరాజ్, అనూష, మూర్తి, శ్రీనివాసులు కొలతలు తీసి పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధిహామీకి సంబంధించిన 20 రికార్డులను తనిఖీ చేశారు. త్వరలో కేంద్ర బృందం కమిటీ సభ్యులు వచ్చే అవకాశం ఉందన్నారు. వీరి వెంట అడిషనల్‌ పీడీ రాజేంద్ర ప్రసాద్, ఏపీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ శివారెడ్డి, ఏపీఓ హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement