మల్లన్నకు నృత్య నీరాజనం
మల్లన్నకు నృత్య నీరాజనం
Published Sat, Dec 31 2016 10:52 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: కళా నీరాజనం సాంస్కృతిక వారోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శ్రీశైలంలో కేవీ సత్యనారాయణ బృందం వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. శనివారం రాత్రి నాగులకట్ట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కెవి సత్యనారాయణతోపాటు డాక్టర్ సీహెచ్ అజయ్‌కుమార్, నదియ, యన్ సురేంద్రనాథ్, లోహిత, అక్షిత, సౌఖ్య, భరత్, మనిషా, శిరీష, విజయకుమార్‌లు..నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఈఓ నారాయణ భరత్ గుప్త మాట్లాడుతూ.. సాంస్కృతిక వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 3 వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేవీ సత్యనారాయణ తెలుగు చలన చిత్రరంగంలో శృతిలయలు, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం తదితర చిత్రాలకు నృత్యదర్శకులుగా వ్యవహరించారని తెలిపారు. అలాగే ఇతర దేశాల్లో నృత్యప్రదర్శనలను ఇచ్చారని పేర్కొన్నారు. నృత్యానికి సంబంధించిన రచనలను కూడా చేశారని, పలు సంస్థల నుంచి నాట్యకళా విశారద, కళాస్వాతి, ఆదర్శకళామూర్తి, నాటక తపస్వీ, నాట్యకళావిపంచి మొదలైన బిరుదులను కూడా పొందారన్నారు. బుల్లితెరలలో ప్రసారమైన అముక్త మాల్యద టెలి సీరియల్‌కు ఆయన దర్శకత్వం వహించినట్లు ఈఓ తెలిపారు. ఆదివారం నూతన సంవత్సరాది సందర్భంగా నాగులకట్ట వేదికపై రాత్రి సుధాకర్ బృందం వారి గాత్రకచ్చేరిని ఏర్పాటు చేశామన్నారు.
Advertisement