వజ్రకరూరు (ఉరవకొండ) : వజ్రకరూరు మండలం తట్రకల్లులో కురుబ తిమ్మప్ప (71) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు తెలిపిన మేరకు... తిమ్మప్ప ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో శనగ మాత్రలు మింగాడు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి 108 ద్వారా గుంతకల్లు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.