old man suicides
-
రైలుకిందపడి వృద్ధుడి ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి(రామగిరి): కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా ఎగువపల్లికి చెందిన వడ్ల రామకృష్ణ(75) శనివారం చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం (ఎన్ఎస్) గేట్ వద్ద శనివారం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఈయన జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించామన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : నగర శివారులోని నేషనల్పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55 సంవత్సరాల వయస్సు, తెలచొక్క, తెల్ల పంచె ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
గుత్తి (గుంతకల్లు) : తురకపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు.. తురకపల్లికి చెందిన కుమ్మర నారాయణ(71)కు కొంత కాలంగా ఆరోగ్యం బాగలేదు. దీనికి తోడు కుటుంబ కలహాలు రోజురోజుకూ అధికమవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుత్తి ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములునాయక్ కేసు నమోదు చేసుకున్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
పుట్లూరు (శింగనమల) : పుట్లూరులో చదువుల లక్ష్మీరెడ్డి(70) విషపు గుళికలు మింగి గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సురేశ్‌బాబు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక జీవితంపై విరక్తితో తనువు చాలించాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. -
వృద్ధుడు బలవన్మరణం
వజ్రకరూరు (ఉరవకొండ) : వజ్రకరూరు మండలం తట్రకల్లులో కురుబ తిమ్మప్ప (71) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ జనార్దన్‌నాయుడు తెలిపిన మేరకు... తిమ్మప్ప ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో శనగ మాత్రలు మింగాడు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి 108 ద్వారా గుంతకల్లు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.