గుత్తి (గుంతకల్లు) : తురకపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు.. తురకపల్లికి చెందిన కుమ్మర నారాయణ(71)కు కొంత కాలంగా ఆరోగ్యం బాగలేదు. దీనికి తోడు కుటుంబ కలహాలు రోజురోజుకూ అధికమవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుత్తి ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములునాయక్ కేసు నమోదు చేసుకున్నారు.