చెన్నేకొత్తపల్లి(రామగిరి): కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా ఎగువపల్లికి చెందిన వడ్ల రామకృష్ణ(75) శనివారం చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం (ఎన్‌ఎస్) గేట్ వద్ద శనివారం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఈయన జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించామన్నారు.