4న కలెక్టరేట్ ముట్టడి
Published Mon, Aug 1 2016 2:26 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
వరంగల్ : రైతుల నుంచి భూసేకరణకు జారీ చేసిన జీఓ ఎం.123ని రద్దు చేసి, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నేడు, రేపు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు భూపాలపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు పరకాల, 2న 10 గంటలకు మహబూబాబాద్, మధ్యాహ్నం 12 గంటలకు డోర్నకల్ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతాయన్నారు. 4న హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుంటామన్నారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు.
Advertisement
Advertisement