ఔటర్ రింగు రోడ్డుపై భారీ కంటెయినర్ దగ్ధం
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కంటెయినర్ అకస్మాత్తుగా అగ్రిప్రమాదానికి గురైంది. తారామతిపేట-పెద్దంబర్ పేట మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా కంటెయినర్ లో మంటలు చెలరేగి కొన్ని నిమిసాల్లో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫైర్ సింబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటలపాటు నేటి వేకువజాము నుంచి ఆ దారిలో రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి దారిని సిద్ధం చేయడంతో ప్రస్తుతం వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. వాహనాన్ని కొన్ని రోజుల కిందటే మలేషియా నుంచి తెప్పించారు. దీని ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలు అని బాధితులు అధికారులకు తెలిపారు.