తిరుమలగిరి మండలకేంద్ర ంలోని ప్రగతినగర్‌లో శుక్రవారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టీవీఎస్ స్కూటీపై వెళ్తున్న ఇద్దరిని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతారం గ్రామానికి చెందిన కడమంచి సోమయ్య(32) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా..రామ్మూర్తి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన రామ్మూర్తిని 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
Published Fri, Jul 8 2016 5:53 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement