దొంగకు ఏడాది జైలు | one year jail for theif | Sakshi
Sakshi News home page

దొంగకు ఏడాది జైలు

Published Thu, Apr 27 2017 1:18 AM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM

one year jail for theif

నిందితుడు బళ్లారి వాసి

గుంతకల్లు: ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగకు ఏడాది జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం మేరకు... గుంతకల్లు మున్సిపల్‌ పరిధిలోని పాతగుంతకల్లుకు చెందిన కురుబ ప్రకాశ్‌ ఇంట్లో గతంలో జరిగిన చోరీ కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన కురుబ నాగరాజు నిందితుడు. పోలీసులు నిందితుడ్ని గుర్తించి అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. గుంతకల్లు జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి వాసుదేవరావు కేసు పూర్వపరాలు పరిశీలించారు. నేరం రుజువు కావడంతో దొంగకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున కేసును ఏపీసీ సుభాషిణి వాదిచారు. దొంగను చాకచక్యంగా పట్టుకోవడంలో శ్రమించి న టూటౌన్‌ ఎస్‌ఐ వలీబాష, హెడ్‌ కానిస్టేబుల్‌ రమేశ్, కోర్టు కానిస్టేబుల్‌ వెంకటేశ్, కానిస్టేబుల్‌ పి.శ్రీనివాసులును డీఎస్పీ సీహెచ్‌ రవికుమార్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement