బైక్ దొంగలకు మూడేళ్ల జైలు శిక్ష
Published Fri, Jun 23 2017 11:35 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
ఆళ్లగడ్డ: ఇద్దరు దొంగలకు ఆళ్లగడ్డ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని జమ్ములమడుగుకు చెందిన రామ్మోహన్, పొద్దుటూరుకు చెందిన శ్రీనివాసులుపై 2013లో ఆళ్లగడ్డ పట్టణంలో బైక్‌లను అపహరించిన కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో ఆళ్లగడ్డ కోర్టు న్యాయమూర్తి దివాకర్ శుక్రవారం నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Advertisement
Advertisement