ఒపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
Published Sat, Jun 3 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
– పదిలో 41.67, ఇంటర్‌లో 54.43 శాతం ఉత్తీర్ణత
– గతేడాది కంటే మెరుగైన ఫలితాలు
కర్నూలు సిటీ: ఒపెన్ స్కూల్ పరీక్షల ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలకు 2839 మంది హాజరుకాగా, 1183 మంది ( 41.67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పది ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో12వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి రాష్ట్రంలో 9వ స్థానం దక్కించుకుంది. ఇంటర్‌లో 3399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1850 మంది (54.43 శాతం) ఉత్తీర్ణత సాధించి, 9వ స్థానంలో నిలిచారు. గతేడాది 11వ స్థానంలో ఉన్నట్లు ఒపెన్ స్కూల్ అధికార వర్గాలు తెలిపాయి.
రీకౌంటింగ్‌కు అవకాశం!
ఒపెన్ స్కూల్స్ పరీక్షల్లో వచ్చిన ఫలితాలపై అనుమానాలు ఉంటే రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. పదోతరగతికి సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు ఫీజు రూ.100 చొప్పున, ఇంటర్ అయితే రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రీవెరిఫికేషన్‌కైతే ఒక్కో సబ్జెక్టుకు 1000 ప్రకారం ఫీజులు ఏపీ ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఈ నెల 5 నుంచి 15 వరకు విద్యాశాఖ గడువు ఇచ్చింది.
Advertisement