
‘ఎస్‌ఆర్‌ఎం’లో ఓజోన్‌డే వేడుకలు
కోదాడఅర్బన్: అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో ఓజోన్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఓజోన్ పొర దెబ్బతింటే సంభవించే పరిణామాలు, ఓజోన్ పొరను సంరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలను పెయింటింగ్‌లుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఓజోన్ పొర వల్ల కలిగే లాభాలు, దాని విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కేశినేని శ్రీదేవి, కేఎల్‌ఎన్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.