మహబూబ్‌నగర్: పాలమూరు కవులకు, కళాకారులకు పుట్టినిల్లువంటిదని కలెక్టర్ టీకే. శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాషాపండితులు, కవులు బంగారు తెలంగాణ అంశంపై పోటాపోటీగా కవిత్వం వినిపించి ఆకట్టుకున్నారు. తెలంగాణ ఆర్తిని, సమకాలిన పరిస్థితులను సమన్వయపర్చుకుంటూ కవితాప్రవాహాన్ని కొనసాగించారు. కవితలపై యువతీ, యువకులు పట్టు సాధించాలని సూచించారు. తెలుగు పండిత్ గిరిజా రమణ రచించిన శతక సాహిత్యాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.
కలెక్టర్ స్వయంగా పాలమూరు వాసి మనోహర్‌రెడ్డి రచించిన కవిత్వాన్ని చదివి వినిపించి విశేషంగా ఆకట్టుకున్నారు. పాత్రికేయులు సైతం బంగారు తెలంగాణపై తమ గళాన్ని కవితారూపంలో వినిపించారు. ఈ సందర్భంగా కవులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సాక్షి బ్యూరో ఇన్‌చార్‌జ వేణుగోపాల్‌ను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. సమ్మేళనానికి కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. జేసీ రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, సెట్మా సీఈఓ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు కవులకు పుట్టినిల్లు
Published Fri, Jun 3 2016 9:09 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement
Advertisement