గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం | parade ready for republic day celebrations | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

Published Wed, Jan 25 2017 11:23 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం - Sakshi

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

అనంతపురం సెంట్రల్‌  : నగరంలో గురువారం నిర్వహించే 68వ గణతం‍త్ర వేడుకలకు పోలీస్‌ పరేడ్‌ మైదానం సందరంగా ముస్తాబైంది. వేడుకలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వీటిని జాయింట్‌ కలెక్టర్‌–2 సయ్యద్‌ఖాజా మొహిద్దిన్‌  పర్యవేక్షించారు. బుధవారం సాయంత్రం ఆర్డీఓ మలోలా, తహశీల్దార్‌ శ్రీనివాసులు ఇతర అధికారులతో పరేడ్‌ మైదానంలో పర్యటించారు.

వీఐపీలకు, అధికారులకు, వీక్షకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని తనిఖీ చేశారు. ఉత్తమ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించి చర్చించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement